విజయవాడలోని కృష్ణా నది కరకట్ట ప్రాంతంలోని ఇళ్లను దేవాదాయశాఖ అధికారులు తొలిగిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. 30 ఏళ్ల నుంచి తామంతా ఇక్కడే ఉంటున్నామని.. ఇప్పుడు కూడా ఇక్కడే ఉంటామని స్పష్టం చేస్తున్నారు.
విషయం తెలుసుకున్న వైకాపా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గలు అక్కడికి చేరుకున్నారు. ఇళ్ల తొలగింపు ఉండదని వారికి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: విజయవాడలో మత్తు దందా.. వాట్సప్‌లో ఆర్డర్లు.. నేరుగా ఇంటికే 'కొరియర్'!