విజయవాడ రైల్వే ప్రధాన ఆసుపత్రిని పూర్తి స్థాయిలో కొవిడ్ ఆసుపత్రిగా మార్పు చేసినట్లు రైల్వే ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వి.సత్యనారాయణ తెలిపారు. ఇందులో 24 గంటలూ వైద్యులు, ఫార్మసిస్టులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. విజయవాడతో పాటు రాయనపాడు, ఏలూరు, బిట్రగుంట, తెనాలి, గూడూరు, భీమవరం, సామర్లకోటలో క్వారంటైన్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైల్వే ఉద్యోగులు, పింఛనర్లు ఆస్పత్రికి రాకుండా టెలీమెడిసన్ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో మధుమేహం, రక్తపోటు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కోసం ప్రతి నెలా ఆసుపత్రిలో మందులు తీసుకెళ్లే రోగులు ఆస్పత్రికి రాకుండా.. ఈసారికి బయట కొనుగోలు చేసుకొని వాటి బిల్లులను అందిస్తే నగదు తిరిగి ఇస్తామని చెప్పారు. రైల్వే ఉద్యోగులంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డి.ఆర్.ఎం.శ్రీనివాస్ కోరారు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడే వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
ఇవీ చదవండి: