విజయవాడ డ్రగ్స్ కేసు విషయంలో పోలీసులు ఇద్దరు విదేశీయులను, పెనమలూరుకు చెందిన కోనేరు అర్జన్ను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ కేసులో విదేశీయులు అరెస్టు కావటం విజయవాడలో ఇది రెండోసారి. సుడాన్‌కు చెందిన రసూల్, టాంజానియాకు చెందిన యోనా నుంచి మత్తు పదార్థాలు కొనుగోలు చేసిన అర్జున్.. విజయవాడలో ఇంజినీరంగ్ విద్యార్థులకు అమ్మేవాడని పోలీసులు వివరించారు.
విక్రయంలో కీలక నిందితుడిగా ఉన్న కోనేరు అర్జున్ బీటెక్ చదివిన రోజుల్లో ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని.. డ్రగ్స్ అమ్ముతున్నట్లు తెలిపారు. అర్జున్ నుంచి ఎవరెవరు మత్తు పదార్థాలు కొనుగోలు చేశారో అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన విదేశీయుల పాస్‌పోర్టులు సీజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి:
ఆటోలో తరలిస్తున్న రూ. 1.81 లక్షల గుట్కా, ఖైనీ ప్యాకెట్ల పట్టివేత