ETV Bharat / state

దేవాలయ భూమిని పాడు చేసిన వారిపై కేసులు పెడతాం: ఈవో సురేశ్ బాబు - దుర్గగుడి ఈవో సురేశ్ బాబు తాజా వార్తలు

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో.. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన భూములను ఆలయ ఈవో సురేశ్ బాబు పరిశీలించారు. ఓ ప్రైవేటు విద్యాసంస్థ.. ఆ భూమిలోకి మురుగు నీరు వదులుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయ భూమిని పాడుచేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు.

vijayawada durga temple eo fires on private college for Sewage is being discharged into the temple belonging land
దేవాలయ భూమిని పాడు చేసిన వారిపై కేసులు పెడతాం: ఈవో సురేశ్ బాబు
author img

By

Published : Mar 20, 2021, 5:41 PM IST

దేవాలయ భూమిని పాడు చేసిన వారిపై కేసులు పెడతాం: ఈవో సురేశ్ బాబు

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో.. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన భూమిలోకి ఓ విద్యా సంస్థ మురుగు నీరు వదులుతోందని ఈవో సురేశ్‌ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు ఏడున్నర ఎకరాల దేవస్థానం భూమిని 6 నెలల కిందట సర్వే చేయించి రాళ్లు వేయించామని చెప్పారు.

ఆ రాళ్లను తొలగించారని మండిపడ్డారు. వ్యవసాయం కోసమని కౌలుకు తీసుకున్న వ్యక్తి.. విద్యా సంస్థల యాజమాన్యంతో కుమ్మక్కై భూమిని పాడుచేశారని ఆరోపించారు. ఈ విషయంలో సంబంధిత విద్యాసంస్థల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టనున్నట్లు ఈవో తెలిపారు.

ఇదీ చదవండి:

తిరుపతి శ్రీవేంకటేశ్వర వర్సిటీలో విద్యార్థి సంఘాల ఆందోళన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.