విజయవాడ పరిధిలోని రెడ్‌జోన్ ప్రాంతాలైన గొల్లపూడి వై జంక్షన్, భవానీపురం, కుమ్మరిపాలెం ప్రాంతాలను నగర పోలీస్ కమిషనర్ ద్వారక తిరుమలరావు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇబ్రహీంపట్నం వైపు నుంచి విజయవాడ నగరంలోకి వచ్చే వివిధ రకాల వాహనాల రాకపోకలను సీపీ స్వయంగా పరిశీలించి అధికారులకు సూచనలు అందించారు. ఈ తనిఖీల్లో నగర డీసీపీ విక్రాంత్ పాటిల్, అదనపు డీసీపీ చంద్రశేఖర్, ఏసీపీ సుధాకర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి :