విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు.. కృష్ణా జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించారు. లాక్ డౌన్ పరిస్థితులను తెలుసుకోవటంతో పాటు...టోల్ గేట్ల వద్ద భద్రతా ఏర్పాట్లును పరిశీలించారు. ఉయ్యూరులో పర్యటించిన సీపీ.. మున్సిపల్, పోలీస్, మీడియా వారు ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొలుసు పార్థసారథితో కలసి పాల్గొన్నారు. ఉంగుటూరు మండల పరిధిలోని పొట్టిపాడు టోల్ గేట్‌ని సందర్శించారు. అక్కడ లాక్ డౌన్ అమలు తీరు గురించి, భద్రతా ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇవీ చదవండి: