ETV Bharat / state

ముమ్మరంగా.. బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ రెండో భాగం పనులు - విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ వార్తలు

విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ రెండో భాగం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏడాదిలోగా పైవంతెన పనులు పూర్తి చేసే దిశగా... భారీ యంత్రాలతో ఫైల్‌ పౌండేషన్, పిల్లర్ల నిర్మాణం జరుగుతోంది. గత నెలలో కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ కనకదుర్గ పైవంతెన ప్రారంభించిన అనంతరం ఈ వంతెనకు శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించారు. వంతెన ఆకృతుల్లో స్వల్ప మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.

vijayawada Benz Circle flyover works are going fast
ముమ్మరంగా సాగుతున్న బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ రెండో భాగం పనులు
author img

By

Published : Nov 29, 2020, 2:18 PM IST

ముమ్మరంగా సాగుతున్న బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ రెండో భాగం పనులు

విజయవాడ బెంజ్‌ సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారీ యంత్రాలు, క్రేన్‌లు, డ్రిల్లింగ్‌ యంత్రాలతో పనులు జోరందుకున్నాయి. ఇప్పటికే పిల్లర్ల నిర్మాణం ప్రారంభమైంది. అక్టోబరులోనే మట్టి నమూనాల పరీక్షలు చేసి.. నవంబరు ప్రారంభం నుంచి పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించారు. రెండోవైపు సర్వీసు రోడ్డును పూర్తిగా మూసివేశారు. 2022 మే నాటికి రెండో వంతెన పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జాతీయ రహదారుల ఇంచార్జి పీడీ శ్రీనివాస్‌ వెల్లడించారు. ఎలాంటి భూసేకరణ లేకుండా పైవంతెన నిర్మాణం చేపడుతున్నారు.

గత ప్రభుత్వం నిర్ణయించిన వంతెన ఆకృతుల ప్రకారం 2 వంతెనలు నిర్మించాల్సి వచ్చింది. బెంజి సర్కిల్‌ పైవంతెన రెండో పార్టు కూడా మొదటి వంతెన తరహలోనే ఉన్నప్పటికీ దూరం కొంత మేరకు తగ్గనుంది. అప్రోచ్‌ రహదారులు ఇరువైపులా కలిపి 350 మీటర్లు మాత్రమే ఉండగా.. మొదటి వంతెనకు అప్రోచ్‌ రహదారి 880 మీటర్లు ఉంది. రహదారితో కలిపి మొదటి వంతెన దూరం 2.3 కిలోమీటర్లు కాగా రెండో పార్టు దూరం 1.78 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇందులో.. పైవంతెన 1438 మీటర్లు ఉంటుంది. ఇతర ఆకృతుల్లో ఎలాంటి మార్పు లేదని జాతీయ రహదారుల సంస్థ అధికారులు తెలిపారు.

ఇప్పటికే గుత్తేదారు సంస్థ జాతీయ రహదారి పక్కనే ఉన్న గ్రీన్‌బెల్ట్‌లోని పచ్చని మొక్కలు తొలగించింది. వంతెన కింది భాగంలో వచ్చే మొక్కలను తొలగించకుండా పనులు చేయాలని కలెక్టర్‌ సూచించారు. మరోవైపు.. దీనిపై స్థానికులు కొంతమంది న్యాయస్థానం ఆశ్రయించారు. పనుల వల్ల ట్రాఫిక్‌ సమస్య ఎక్కువగా ఉందని కోర్టుకెక్కారు. ఏడాదిన్నరలో వంతెన నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నట్లు జాతీయ రహదారుల ఇంచార్జి పీడీ శ్రీనివాస్‌ వివరించారు. నవంబరు 5 నుంచి పనులు ప్రారంభించారని చెప్పారు.

ఇదీ చూడండి:

'పార్లమెంట్ సమావేశాల్లో లేని నిషేధం.. ఇక్కడ ఎందుకు?'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.