వైభవంగా...మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుని ఉత్సవాలు కృష్ణా జిల్లాలో మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణాన్ని విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.