ETV Bharat / state

'దేశాభివృద్ధికి సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది' - undefined

ఆత్కూరు స్వర్ణ భారతి ట్రస్ట్​లో  నిర్వహించిన స్కిల్ ఇండియా కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి, గవర్నర్ పాల్గొన్నారు. యువతీ యువకులు రూపొందించిన వివిధ స్టాల్స్​ను తిలకించారు. దేశాభివృద్ధికి చక్కటి సంస్కరణలు తీసుకోవాల్సి ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  అభిప్రాయపడ్డారు.

దేశాభివృద్ధికి సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది: ఉపరాష్ట్రపతి
author img

By

Published : Aug 27, 2019, 11:40 PM IST

దేశాభివృద్ధికి సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది: ఉపరాష్ట్రపతి

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారతి ట్రస్ట్​లో స్కిల్ ఇండియా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్​లో యువతీయువకులు రూపొందించిన వివిధ కళా ఖండాలు, వస్తువులతో ఏర్పాటు చేసిన స్టాల్స్​ని తిలకించారు. అనంతరం జరిగిన సభలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... దేశం అభివృద్ధి చెందాలంటే చక్కటి సంస్కరణలు తీసుకోవాల్సి ఉందని... ప్రస్తుతం దేశంలో అదే జరుగుతుందన్నారు. విద్య కేవలం ఉద్యోగానికే కాకుండా యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని ఏ దేశంలో లేని యువశక్తి.... మన దేశంలో ఉందన్నారు.

గవర్నర్ ఏమన్నారంటే...
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని గవర్నర్ పేర్కొన్నారు. యువకులు నైపుణ్య అభివృద్ధిపై దృష్టి సారించి...ఈ రాష్ట్రాన్ని... ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. నిరుద్యోగ యువకులకు నైపుణ్య అభివృద్ధిపై స్వర్ణభారత్ ట్రస్టు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు.

Intro:AP_VSP_57_27_TEACHERS KORATAPAI ANDOLANA_AVB_AP10153Body:సీలేరు బాలికల ఆశ్రమ పాఠాలకు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులను నియమించకపోతే తమ పిల్లలను తీసుకెళ్లిపోయి పాఠశాలకు తాళం వేస్తామని విద్యార్థినులు తల్లిదండ్రులు హెచ్చరించారు. మంగళవారం మధ్యాహ్నం విద్యార్థులు , తల్లిదండ్రులు సీలేరులో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. విద్యార్తులతో కలిసి నిర్వహించిన ఆందోళన విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ ఆందోళనలో అధికారులు తీరును దుయ్యబట్టారు. అఖిపక్షనాయకులు, గిరిజన సంఘ నాయకులు ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. స్థానిక మెయిన్‌రోడ్డులో విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల కార్యదర్శి ఎ.బొంజిబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయులు కొరత గురించి ఆందోళనకు తయారవుతుండగా అధికారులు కంటితుడుపు చర్యగా ఆరుగురు ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై నియమించారని, వీరి వల్ల విద్యార్థులకు ఎటువంటి ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దుప్పిలవాడ మాజీ సర్పంచి అల్లంకి రాజు, మాజీ ఎంపీటీసీ కిల్లో గోపీనాథ్‌, సీపీఐ జిల్లా నాయకులు ఎస్‌.విష్ణుమూర్తి, సీపీఎం నాయకులు బాకూరి కోటే్శ్వరరావు, డీసీసీ కార్యదర్శి కారేశ్రీనివాసు, పి.మల్లుదొర తదితరులు పాల్గొన్నారు.
Conclusion:బైట్:
1.ఎస్‌.విష్ణుమూర్తి, సీపీఐ జిల్లా కార్యవర్గసబ్యులు
2.ఎ.బొంజిబాబు, గిరిజన సంఘం మండల కార్యదర్శి

M.RAMANARAO, SILERU AP10153

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.