ETV Bharat / state

వావ్.. వందేభారత్.. అంచనాలు మించుతోందిగా..! - దక్షిణ మధ్య రైల్వే

దక్షిణ మధ్య రైల్వే ప్రతిష్ఠాత్మకంగా నడిపిస్తోన్న వందేభారత్‌ రైలుకు అనూహ్య స్పందన వస్తోంది. సికింద్రాబాద్-విశాఖ రెండు వైపులా భారీ రద్దీ ఉంటోంది. ఈ రైలును జనవరి 15న ప్రారంభించగా.. మరుసటి రోజు నుంచి ఇరువైపులా సగటున 140శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదవుతోంది.

వందేభారత్‌ రైలుకు అనూహ్య స్పందన
వందేభారత్‌ రైలుకు అనూహ్య స్పందన
author img

By

Published : Feb 19, 2023, 4:04 PM IST

Updated : Feb 19, 2023, 5:40 PM IST

వందేభారత్‌ రైలుకు అనూహ్య స్పందన

Vandebharat express : దక్షిణ మధ్య రైల్వే ప్రతిష్ఠాత్మకంగా నడిపిస్తోన్న వందేభారత్‌ రైలుకు అనూహ్య స్పందన వస్తోంది. సికింద్రాబాద్-విశాఖ రెండు వైపులా భారీ రద్దీ ఉంటోంది. ఈ రైలును జనవరి 15న ప్రారంభించగా.. మరుసటి రోజు నుంచి ఇరువైపులా సగటున 140శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదవుతోంది. వందేభారత్‌ను వినియోగించుకుంటున్న వారిలో విజయవాడ, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లే అత్యధికంగా కావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం మధ్య వందేభారత్‌ పరుగులు తీస్తుంది. మార్గమధ్యలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. ఆయా స్టేషన్లలో అత్యధికంగా విజయవాడ నుంచే ఈ రైలులో రాకపోకలు కొనసాగిస్తున్నారు.

విజయవాడ కీ పాయింట్.. ఈ ఆత్యాధునిక ప్రీమియర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును పగటి వేళల్లో నడుపుతుండడంతో అటు విశాఖపట్నం ఇటు సికింద్రాబాద్ వరకు విజయవాడ కేంద్రంగా ఎక్కువ మంది ప్రయాణికులు గమ్యం చేరుకుంటున్నారు. విశాఖపట్నంలో ప్రారంభమయ్యే వందేభారత్‌లో గడిచిన నెల రోజుల వ్యవధిలో విజయవాడ స్టేషన్ నుంచి ఖమ్మం-వరంగల్ మీదుగా సికింద్రాబాద్‌కు 8,613 మంది ప్రయాణించారు. ఇదే సమయంలో విశాఖ, రాజమండ్రిలో ఎక్కి విజయవాడలో దిగిన ప్రయాణికులు మరో 9,742మంది ఉన్నారు.

రెండు వైపులా విజయవాడ మీదగా అధికం.. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే రైలులో నెల రోజుల వ్యవధిలో... విజయవాడ నుంచి రాజమండ్రి మీదుగా వైజాగ్ వరకు 9,883మంది ప్రయాణించారు. మరో 10,970మంది సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం నుంచి విజయవాడ చేరుకున్నారు. విజయవాడ నుంచి విశాఖకు 4.30గంటలు, సికింద్రాబాద్‌కు 4గంటల్లో చేరిపోతుండడంతో ఉదయం వేళ ప్రయాణించే వాళ్లు ఈ రైలుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. విజయవాడ స్టేషన్‌లో నిత్యం సగటున 638మంది వందేభారత్‌ రైలు ఎక్కుతున్నారు. మరో 714మంది ఇరు ప్రాంతాల నుంచి వచ్చి విజయవాడలో దిగుతున్నారు.

వేగంతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణం కోరుకునే వారికి అనుకూలంగా ఉండే రైలు ఇది అని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్ తెలిపారు. ప్రస్తుతం విజయవాడ నగరంతో పాటు సమీప ప్రాంతాల ప్రయాణికులు ఇష్టపడే రైళ్లలో వందేభారత్‌ కూడా ఒకటిగా మారిపోయిందని పేర్కొన్నారు. వందేభారత్ రైలు.. అంతర్జాతీయ ప్రమాణాలకు తీసిపోని విధంగా అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికుల అవసరాలను తీరుస్తోందని ఆయన చెప్పారు.

గత నెల ప్రయాణికుల వివరాలు ఇవీ..:
గత నెల రోజుల్లో సికింద్రాబాద్‌-విశాఖ రైలులో మొత్తం ప్రయాణికుల సంఖ్య : 47,055, సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఎక్కినవాళ్లు : 31,870, వరంగల్‌ స్టేషన్‌లో ఎక్కినవాళ్లు: 2,211 అదేవిధంగా ఖమ్మం- 1,586, విజయవాడ-9,883, రాజమండ్రి- 1,505

విశాఖ-సికింద్రాబాద్‌ రైలులో మొత్తం ప్రయాణికుల సంఖ్య : 44,938 కాగా, విశాఖలో ఎక్కిన వాళ్లు 30,428, రాజమండ్రిలో 4,011, విజయవాడలో 8,613, వరంగల్ లో 704, ఖమ్మం స్టేషన్లలో ఎక్కిన ప్రయాణికుల సంఖ్య 1,182గా నమోదైంది.

ఇవీ చదవండి :

Last Updated : Feb 19, 2023, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.