హిందూ దేవాలయాల భూముల పరిరక్షణ దిశగా... ఆ భూములను ఇతరులకు ఇవ్వకూడదని గత ప్రభుత్వం జీవో 425,426ను జారీ చేసింది. ఆ ఉత్తర్వులను తమకూ వర్తింపచేయాలని ముస్లిం సంఘాల నేతలు డిమాండ్ చేశారు. విజయవాడలోని ఓ హోటల్లో యునైటెడ్ ముస్లిమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంఘం ఆధ్యర్యంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులు నూటికి తొంభై శాతం ఇతర మతస్థుల చేతిలో ఉన్నాయని సంఘం అధ్యక్షులు హజరత్ మొహమ్మద్ అల్తాఫ్ రజా తెలిపారు. దేవాలయాల ఆస్తుల్లో అన్యమతస్థులు రాకూడదని చెప్పినట్టే... వక్ఫ్ భూముల్లో కూడా ముస్లింలే ఉండేట్టు చట్టాలు తేవాలన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసకోవాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి