కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో గుర్తు తెలియని వ్యక్తులు పసికందును వదిలేసి వెళ్లిపోయారు. అరుగోలను గ్రామంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అరుగొలనులోని స్నేహ భవన్లో మేరి అనే సిస్టర్ బయటికి వచ్చి చూడగా ఆ పసిపాప కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఆ శిశువు బెడ్షిట్తో చుట్టి బుట్టలో పెట్టిసి దుండగలు వెళ్లిపోయినట్లు చెప్పారు. ఆ పాప ఏడుపు విన్న మేరీ... శిశువును తన దగ్గర ఉంచుకున్నట్లు వివరించారు. ఘటనపై సీసీ కెమెరాలోని పుటేజీని పరిశీలిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న హనుమాన్ జంక్షన్ ఎస్ఐ చంటిబాబు, ఐసీడీఎస్, సీడబ్యూసీ, ఎంఎస్కే వివరాలు సేకరిస్తున్నారు.
ఇవీ చదవండి