గ్లోబల్ ఫౌండేషన్ సహకారంతో యూనిసెఫ్ నుంచి 40 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను తెప్పించామని ఏపీ ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి తెలిపారు. ప్రాణవాయువు కొరతతో కరోనా బాధితులు మరణించకూడదనే సమకూర్చామని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రాణవాయువు పరికరాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందజేయనున్నట్లు గౌతమ్ రెడ్డి వెల్లడించారు.
మూడో దశ రాకముందే అప్రమత్తంగా ఉండాలి..
కొవిడ్ రెండో దశ వ్యాప్తిలో ఆక్సిజన్ కొరతతో బాధితులు ఎక్కువ సంఖ్యలో మరణించడం బాధాకరమని గౌతమ్ ఆవేదన వ్యక్తం చేశారు. మూడో దశ కరోనా మహమ్మారి ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. త్వరలో స్వచ్ఛంద సంస్థల అండదండలతో రాష్ట్రంలో మూడు ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పుతామన్నారు.
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి..
కరోనా బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు కరోనా సోకకుండా వాక్సినేషన్ చేయించుకోవాలని పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి : 20 డాలర్ల పెట్టుబడి- ఒక్క రాత్రిలో రూ.కోటి కోట్ల రాబడి!