కాళ్లు కడుక్కునేందుకు నీటిలోకి దిగిన ఆ బావ, బావమరుదులను లోతైన చెరువు మింగేసింది. ఈ ఘటన కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం, కొత్త ఈదరలో జరిగింది. గ్రామానికి చెందిన బెక్కం ఉదయ్‌కిరణ్ ఇంటర్మీడియట్, యర్రా వెంకటసాయి హరినాథ్ ఎనిమిదో తరగతి పూర్తి చేసి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నారు. వరుసకు బావ, బావమరుదులైన వీరు తమ పొలంలో వరినాట్లు వేస్తుండగా అక్కడికి వెళ్లారు. పక్కనే ఉన్న చవిటికుంట చెరువులో కాళ్లు కడిగేందుకు దిగారు. దానిలోతు తెలియని వారు నీటిలో మునిగిపోయి చనిపోయారు. ఎస్సై కిషోర్, తహసీల్దార్ వీవీ.భరత్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. వీరి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇరు కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: