కృష్ణా జిల్లా నూజివీడులో పనికి వెళ్లి ఇద్దరు యువకులు మట్టి పెళ్లల్లో కూరుకుపోయి మృతిచెందారు. నూజివీడు మండలం పోతురెడ్డిపల్లి గ్రామంలో నాసిం చెరువులో ఇసుక పనికి వెళ్లిన గోపాలరావు, గోపాలకృష్ణ... సాయంత్రం చెరువులోకి దిగారు. ఇసుక కోసం మట్టి కింద చేసిన సొరంగం ఆ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఇద్దరు యువకులు మట్టి పెళ్లలో మధ్యలో ఇరుక్కుపోయి మృతిచెందారు.
ఇదీ చదవండీ... ఆర్థిక రథచక్రాన్ని కనీస వేగంతోనైనా నడపాలి: సీఎం జగన్