ETV Bharat / state

రెండు లారీలు ఢీ... డ్రైవర్​కు గాయాలు - పొట్టిపాడు తాజావార్తలు

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ సమీపంలో రెండు లారీలు ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ లారీ ముందు భాగం ధ్వంసమవ్వగా... డ్రైవర్​ గాయపడ్డాడు.

Two lorries collided
ఢీకొన్న లారీలు
author img

By

Published : Jun 12, 2021, 12:34 PM IST

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్​గేట్ సమీపంలో ఆగి ఉన్న లారీని... మరో లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన లారీ ముందుభాగం ధ్వంసమైంది. ఆ వాహన డ్రైవర్​ శివప్పకు గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న అత్కూరు పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హైవే అంబులెన్స్​లో క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. పెట్రోలింగ్ సిబ్బంది సాయంతో లారీని పక్కకి తీయించి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు.

ఇదీ చదవండి:

'కర్ఫ్యూ' ఉల్లంఘన.. 10 వేల వాహనాలు సీజ్​: ట్రాఫిక్ ఏడీసీపీ సర్కార్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.