ETV Bharat / state

ప్రజలను బెదిరించి నగదు దోపిడీ.. నకిలీ పోలీసులు అరెస్ట్ - నకిలీ పోలీసులను గుర్తించిన పెడన ఎస్సై

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నకిలీ పోలీసులను పట్టుకోవడం కలకలం రేపింది. అనిశా డీఎస్పీ, పోలీస్ అధికారులమని పలువురిని నమ్మించి లక్షల్లో కొల్లగొట్టిన కేటుగాళ్లను.. బందరు తాలూకా సీఐ, పెడన ఎస్సై వారి సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు.

fake police, fake police arrested in machilipatnam
నకిలీ పోలీసులు అరెస్ట్, మచిలీపట్నంలో నకిలీ పోలీసులు అరెస్ట్
author img

By

Published : Apr 20, 2021, 10:45 PM IST

పోలీసు అధికారులమంటూ అమాయక ప్రజలను బెదిరించి నగదు వసూలు చేస్తున్న వ్యక్తులను మచిలీపట్నం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ తెలిపారు. అనిశా డీఎస్పీ, పోలీస్ అధికారులుగా అవతారం ఎత్తిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. రాచంపల్లి శ్రీనివాసులు అలియాస్ మంగలి శ్రీను అనే నిందితుడిని.. అనంతపురం జిల్లా నల్లమడ మండలం మంగళ వెలమద్ది గ్రామస్థుడిగా గుర్తించారు. అతడి వద్ద నుంచి రూ. లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనుకి 20 ఏళ్ల నేర చరిత్ర ఉన్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: లాక్​డౌన్​ నుంచి దేశాన్ని కాపాడాలి: మోదీ

సిబ్బందితో కలిసి పెడన ఎస్సై మురళి తనిఖీలు నిర్వహిస్తుండగా.. పోలీసులను చూసి నిందితుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. బందరు తాలూకా సీ‌ఐతో కలిసి పెడన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. గతంలో గొలుసులు, ద్విచక్రవాహనాలు, ఇతరత్రా దొంగతనాలు చేయగా.. కదిరి, పూతలపట్టు, పీలేరు, మదనపల్లి, పాకాల, కర్నూలు, తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాల్లో 17 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. కోర్టులో హాజరుపరిచే సమయంలో ఎస్కౌర్ట్ సిబ్బందిని ప్రలోభపెట్టి తప్పించుకునేవాడని పేర్కొన్నారు. 2009 నుంచి 2013 సంవత్సరం వరకు కడప సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించినట్లు చెప్పారు. అనంతరం పోలీసు శాఖకు చెందిన వ్యక్తిగా నమ్మించి ఫోన్​ ద్వారా అమాయక ప్రజలను బెదిరించడం, భయపెట్టడం, కేసులు మాఫీ చేయిస్తానంటూ లక్షలు డిమాండ్ చేయడం మొదలుపెట్టాడని ఏఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి:

ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రోత్సవాలు.. చామంతి, సంపెంగలతో పూజలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.