కృష్ణా జిల్లాలో పిడుగుపాటుతో ఇద్దరు మృతి చెందారు. గంపలగూడెం మండలం ఆర్లపాడులో ఇద్దరు వ్యక్తులు గొర్రెలు మేపుతుండగా వర్షం కురిసింది. దీంతో సమీపంలోని ఓ చెట్టు కిందకు వెళ్లారు. ఒక్కసారిగా పిడుగు పడటంతో వీరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మడిపల్లి రవి, రాచబంతి నరసిమ్మగా పోలీసులు గుర్తించారు. వీరి స్వగ్రామం తిరువూరు సమీపంలోని గొల్లపూడిగా తేల్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి