భాజపా, వైకాపా, తెదేపాలను రాష్ట్రం నుంచి తరిమికొట్టి రాష్ట్రాన్ని రక్షించుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు తులసి రెడ్డి రాష్ట్ర ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు ఉద్యమించి... రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న పార్టీలను తరిమికొట్టాలన్నారు.
కేంద్రంలోని యుపీఏ ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్‌కు 3 వరాలు ఇచ్చిందని అన్నారు. హామీలు అన్ని అమలై ఉంటే నవ్యాంధ్ర... స్వర్ణాంధ్ర అయి ఉండేదన్నారు. దురదృష్టవశాత్తు కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో గతంలో తెదేపా, ప్రస్తుతం వైకాపా అధికారంలోకి రావడంతో విభజన హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే విభజన హామీలను అమలు చేసి ఉండేదన్నారు.
ఇదీ చూడండి.
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద