కరోనా వ్యాప్తి దృష్ట్యా.. కృష్ణా జిల్లా నూజివీడు ఆర్జీయూకేటీ ఛాన్స్లర్ కె.సి. రెడ్డి ఆదేశానుసారం ట్రిపుల్ ఐటీ క్యాంపస్ విద్యార్థులను ఇళ్లకు పంపిస్తున్నట్లు డైరెక్టర్ జి. వి. ఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. శ్రీకాకుళం, నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోని ఆరువేల మంది విద్యార్థులలో 4 వేల మందిని ఇళ్లకు పంపిస్తున్నట్లు తెలిపారు. పీయూసీ-1 విద్యార్థులకు ఆన్లైన్ తరగతులపై అవగాహన కల్పించటం, ఇంజనీరింగ్ ఫైనలియర్ విద్యార్థులను ఎంటెక్ ఎంట్రన్స్, విదేశాలలో ప్రవేశాలకు సంబంధించి ఆన్లైన్లో భోదన నిమిత్తం ఇక్కడే ఉంచుతున్నట్లు స్పష్టం చేశారు.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ ద్వారా ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి, నెగిటివ్ నిర్ధరణ జరిగిన వారిని మాత్రమే క్యాంపస్‌లోకి అనుమతించనున్నట్లు తెలిపారు. బ్యాచ్‌ల వారీగా విద్యార్థులకు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు.
ఇదీచదవండి