ETV Bharat / state

బాలుకు అభిమానుల అశ్రు నివాళి

గాన గంధర్వడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు నివాళులు అర్పించారు. ఆయన భౌతికంగా మనకు దూరమైనా.. పాటల రూపంలో ఎప్పుడూ బతికే ఉంటారని అభిమానులు అన్నారు.

tribute to sp bala subramanyam
బాలుకు అభిమానుల నివాళి
author img

By

Published : Sep 26, 2020, 4:56 PM IST

కృష్ణా జిల్లాలో..

ఎస్పీ బాలసుబ్రణ్యం మృతి పట్ల కృష్ణా జిల్లా గుడివాడలో కళాభిమానులు సంతాపం తెలిపారు. బాలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన పాడిన పాటలతో ఎప్పటికీ మన మధ్యే ఉంటారని అన్నారు.

నెల్లూరు జిల్లాలో..

నెల్లూరు నగరంలోని వైకాపా జిల్లా కార్యాలయంలో ఎస్పీ బాలసుబ్రమణ్యంకు పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి. ఎస్పీ బాలు మరణం లేని మధుర గాయకుడని, ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి కొనియాడారు. బాలు మరణం సంగీత ప్రియులను, సాహిత్య ప్రియులను కలిచివేస్తోందని అన్నారు.

అనంతపురం జిల్లాలో..

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆకస్మిక మరణం తెలుగు సంగీత రంగానికి తీరని లోటు అని.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెదేపా ఇన్​ఛార్చి ఉమామహేశ్వర నాయుడు అన్నారు. కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్​లో బాలు సంతాప సభ ఏర్పాటు చేశారు. బాలసుబ్రమణ్యం కుటుంబానికి తమ సానుభూతిని తెలిపారు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని అనంతపురం జిల్లా పెనుకొండ మిట్టాంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీ అధ్యక్షుడ శ్రీనివాసులు అన్నారు. బాలు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మిట్ట ఆంజనేయ స్వామి ఆలయ భక్తి మండలి సభ్యులు బాలసుబ్రమణ్యం పాడిన పాటలు ఆలపించి శ్రద్ధాంజలి ఘటించారు.

ఇదీ చదవండి:

కోటి రాగాల గళం మూగబోయిందంటే ఎట్టా నమ్మేది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.