రాష్ట్రంలో కొందరు ఐఎఎస్ అధికారుల బదిలీల్లో స్వల్పంగా మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ అయిన స్వప్నిల్ దినకర్‌ను కాకినాడ మున్సిపల్ కమిషనర్‌గా ఉంచుతూ ఆదేశాలు జారీ చేసింది. సెర్ప్ సీఈఓ రాజబాబును చిత్తూరు జిల్లా జేసీగా బదిలీ చేశారు. మైనారిటీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ఎ.ఎండీ ఇంతియాజ్‌ను సెర్స్ సీఈఓగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీసీఎల్ఏలో అప్పీల్స్ డైరెక్టర్‌గా ఉన్న అదనపు బాధ్యతల నుంచి కూడా ఆయన్ను రిలీవ్ చేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న గంధం చంద్రుడును మైనారిటీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. పశ్చిమగోదావరి జిల్లా జేసీగా బదిలీ అయిన సుమిత్ కుమార్‌ను తిరిగి శ్రీకాకుళం జేసీగానే నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర చేనేత కార్మికల సహకార సొసైటీ వీసీఎండీగా బదిలీ అయిన బీఆర్ అంబేడ్కర్‌ను పశ్చిమగోదావరి జిల్లా జేసీగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
ఇదీ చూడండి.