విజయవాడలోని కృష్ణలంక పూల సంత సమీపంలో ఓ మహిళ కాలువలో మునిగిపోయింది. స్నానానికి దిగిన క్రమంలో ప్రమాదం జరిగింది. నీటిలో కొట్టుకుపోతున్న మహిళను గమనించిన ట్రాఫిక్ సిబ్బంది ఆమెను కాపాడారు. మహిళను విజయనగరానికి చెందిన పెనుమత్స బంగారు(55)గా గుర్తించారు. మహిళ స్వల్ప అస్వస్థతకు గురి కావటంతో ప్రథమ చికిత్స అనంతరం ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: వైకాపా నేత కుమారుడిపై హత్యాయత్నం