లాక్ డౌన్ ఆంక్షలు సడలించటంతో విజయవాడలో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. వైరస్ను కట్టడి చేసేందుకు అధికారులు మాస్క్ ధరించి బయటకు రావాలని నిబంధన విధించారు. కొంతమంది నిబంధనలను పట్టించుకోకుండా విచ్చలవిడిగా రోడ్లపైకి వస్తున్నారని... మాస్క్లు ధరించకుండా వాహనాలపై తిరగుతున్నారని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మార్కెట్లు, షాపుల వద్ద భౌతికదూరం కనుమరుగవ్వటంతో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
విజయవాడలో నిత్యం 11 ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం తనిఖీలు చేస్తున్నారు. మాస్క్ లేకుండా రోడ్డుపైకి వస్తే జరిమానా విధిస్తున్నారు. అంతేకాదు పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి... వారికి మాస్క్ లను అందిస్తున్నారు. ఈనెలలో మాస్క్ లేకుండా బయటకు వచ్చిన 4వేల మందిపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదుచేసి రూ.4లక్షల జరిమానా వసూలు చేసినట్లు ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ తెలిపారు.
ఇదీ చదవండి: