కృష్ణా జిల్లా జాతీయ రహదారిపై జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్దనున్న రాష్ట్ర సరిహద్దు.. ఉదయం నుంచీ వాహనాలతో కిటకిట లాడింది. సోమవారం నుంచి ఏపీలో సరిహద్దు చెక్ పోస్ట్ ఎత్తివేస్తారని వదంతులు రావడంతో రోజు కంటే మూడు రెట్లు అధికంగా వాహనాలు తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి బారులు తీరాయి.
చెక్ పోస్ట్ వద్ద ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకు ఇబ్బందిగా మారింది. మధ్యాహ్నం తర్వాత నుంచి వాహనాల సంఖ్య తగ్గడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ-పాస్ లేకుండా వచ్చిన వాహనాలను వెనక్కి పంపడం, ఉన్నవారికి రద్దీ వల్ల ఆలస్యం కావడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు.
ఇదీ చదవండి: