లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ... వాయిద్య కళాకారులు వినూత్నంగా నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా వాయిద్యా కళాకారులంతా తమ ఇళ్ల వద్దే నాదోపాసన పేరుతో హిందోళ రాగం - సామజవరగమన కీర్తనలతో 10 నిమిషాల పాటు వాయిద్యాలను వాయించారు. కరోనా వల్ల పెళ్లిళ్లు లేక ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామని వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షుడు యలమందరావు వాపోయారు. దేవాలయాలు మూసివేయడం వల్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పేర్కొన్నారు. సంవత్సరంలో 60 రోజులే తమకు ఉపాధి లభిస్తుందని.. ఇప్పుడు కరోనా వల్ల 30 రోజులు పని లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ఆర్థిక చేయూతనిచ్చి ఆదుకోవాలని కోరారు.
ఇదీ చూడండి..