రాష్ట్ర ప్రభుత్వం 4 నెలలుగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేసి వారిని రోడ్డున పడేసే స్థాయికి తెచ్చిందని భవన నిర్మాణ కార్మికుల సలహా మండలి ఛైర్మన్ శ్రీనివాస నాయుడు ఆరోపించారు. దీనికి నిరసనగా రేపు అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు భిక్షాటన కార్యక్రమం చేపడుతున్నట్లు శ్రీనివాస నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి అనాలోచిన నిర్ణయాలే ఈ వైఖరికి కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో నాలుగు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొన్నందున నెలకు రూ.10 వేల చొప్పున ఒక్కో కార్మికుని కుటుంబానికి చెల్లించాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి