![](https://assets.eenadu.net/article_img/mesham_2.jpg)
ధర్మ సిద్ధి ఉంది. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేస్తారు. కొన్ని చర్చలు ఫలిస్తాయి. మీరు అనుకున్నది నెరవేరుతుంది. ప్రసన్నాంజనేయ సోత్రం పారాయణ చేయాలి.
![](https://assets.eenadu.net/article_img/vrushabam.jpg)
కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా.. వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. కనకధారాస్తవం పఠించాలి.
![](https://assets.eenadu.net/article_img/midhunam.jpg)
ఒక ముఖ్యమైన విషయంలో ఆశించినదానికంటే ఎక్కువ పురోగతి ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మొదలుపెట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. సంకటహర గణపతి స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.
![](https://assets.eenadu.net/article_img/karkatakam_2.jpg)
తలపెట్టిన కార్యాలు నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటాయి. మీ మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివ నామ స్మరణ ఉత్తమం.
![](https://assets.eenadu.net/article_img/simham_1.jpg)
చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.
![](https://assets.eenadu.net/article_img/kanya_1.jpg)
పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. కొందరి ప్రవర్తన మీ మనసును కలవరపెడుతుంది. అకారణ కలహసూచన ఉంది. దైవారాధన ఎట్టిపరిస్థితుల్లోనూ మానకండి. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.
![](https://assets.eenadu.net/article_img/tula_1.jpg)
మీ మీ రంగాల్లో ఎక్కువగా కష్టపడాలి. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. సాయిబాబా నామస్మరణ శుభ ఫలితాలనిస్తుంది.
![](https://assets.eenadu.net/article_img/vruschikam.jpg)
తలపెట్టిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శివ స్తోత్రం పఠించడం మంచిది.
![](https://assets.eenadu.net/article_img/dhanussu.jpg)
కొన్ని కీలక నిర్ణయాలు మీకు అనుకూలంగా వెలువడతాయి. కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కొందరి ప్రవర్తన మనస్తాపానికి గురిచేస్తుంది. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆంజనేయ ఆరాధన మంచిది.
![](https://assets.eenadu.net/article_img/makaram_3.jpg)
సమాజంలో కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. గోసేవ చేస్తే బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే మంచి జరుగుతుంది.
![](https://assets.eenadu.net/article_img/kumbam_1.jpg)
కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాలు చేసేటపుడు జాగ్రత్తగా ఉండాలి. దుర్గ స్తోత్రం పఠించాలి.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు.
ఇవీ చూడండి : CM Jagan review: రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆస్పత్రులకు భూములు: సీఎం జగన్