ETV Bharat / state

'9 నుంచి ఉద్యమం.. ఆ అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిందే..' - AP CPSEA

Government held talks with three trade unions : పీఆర్సీ పెండింగ్ అంశాలతో పాటు ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై మూడు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం ఇవాళ చర్చలు జరుపుతోంది. ఏపీ జేఏసీ అమరావతి ఈ నెల 9వ తేదీ నుంచి ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలను అత్యవసరంగా ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. 9వ తేదీ నుంచి ఉద్యమం యథావిధిగా కొనసాగుతుందని నేతలు తేల్చిచెప్పారు.

ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు
author img

By

Published : Mar 7, 2023, 5:32 PM IST

Updated : Mar 7, 2023, 5:51 PM IST

Government Talks with Employees Unions : పీఆర్సీ పెండింగ్ అంశాలతో పాటు ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై మూడు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం ఇవాళ చర్చలు జరుపుతోంది. ఏపీ జేఏసీ అమరావతి ఈ నెల 9వ తేదీ నుంచి ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలను అత్యవసరంగా ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఇప్పటికే ఓ దఫా మంత్రి బొత్స నివాసంలో అనధికారికంగా చర్చలు నిర్వహించిన మంత్రుల కమిటీ సభ్యులు.. ఇవాళ మరోమారు సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్లను మాత్రమే ప్రభుత్వం చర్చలకు పిలిచింది. సంఘానికి ముగ్గురు ప్రతినిధుల చొప్పున చర్చలకు రావాలని ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు ఈసారి కూడా కేఆర్ సూర్యనారాయణ సారథ్యంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించలేదు.

ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు

సచివాలయంలో మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ తదితర సంఘాల నేతలు హాజరయ్యారు. కాగా, ఈసారి కూడా కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించలేదు. ఆర్థికపరమైన అంశాలపై స్పష్టత ఇవ్వాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై ప్రభుత్వం ప్రకటన చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. పీఆర్సీ బకాయిలతో పాటు ఇతర అన్ని ఆర్థికపరమైన వివరాలు చెప్పాలని కోరారు. మార్చి 9వ తేదీ నుంచి జరిగే ఉద్యమం యథావిధిగా కొనసాగుతుందని నేతలు తేల్చిచెప్పారు. మంత్రుల కమిటీతో జరిపిన చర్చలు.. వాటి ఫలితాలపై అన్ని జిల్లాల నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెల్లడించారు.

సోమవారం విశాఖలో జరిగిన సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించిందని అన్నారు. ఉద్యోగులు, కుటుంబాల ఆవేదన, ఆక్రందనను తెలియజేసేందుకే ఉద్యమం చేపడుతున్నట్లు తెలిపారు. చట్టబద్ధంగా రావాల్సినవి ఇవ్వకపోవడం, తాము దాచుకున్న డబ్బులు చెల్లించకపోవడం, ఎన్నికల హామీలను విస్మరించడం అంశాలే ప్రధానంగా ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మాకు అందాల్సిన డీఏ.. ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కు తీసుకోవడాన్ని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అర్థిక, ఆర్థికేతర సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా ఈనెల 9 నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు ఆయన పిలుపునివ్వగా.. ఏపీ సీపీఎస్ఈఏ మద్దతు ప్రకటించింది.

ఇవీ చదవండి :

Last Updated : Mar 7, 2023, 5:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.