2020 విద్యుత్ యాక్టు సవరణకు సంబంధించి వైకాపా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖకి కట్టుబడకుండా ఉంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం హెచ్చరించింది. 2022 పే రివిజన్‌కు సంబంధించి మెరుగైన ఫిట్ మెంట్ బెనిఫిట్ లభించేందుకు పోరాడుతామని తేల్చిచెప్పారు. లాక్ డౌన్ సమయంలో కంటోన్మెంట్ జోన్లలో విధులు నిర్వహిస్తూ... కరోనాతో కొందరు చనిపోయినట్టు గుర్తు చేశారు.
అలాంటి విద్యుత్ కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లుగానే ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీఎన్ టీయూసీ అనుబంధ సంఘమైన తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 2021 డైరీ, కేలండర్ ఆవిష్కరణ మహోత్సవంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎమ్మెల్సీ పరచూరి అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: