!['అర్థరాత్రి కూల్చివేతలు జగన్ ఫాసిస్టు ధోరణికి నిదర్శనం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9293945_785_9293945_1603525544371.png)
గీతం సంస్థకు ఎలాంటి నోటీసు లేకుండా అర్థరాత్రి కూల్చివేత చేపట్టడం జగన్ ఫాసిస్టు ధోరణికి నిదర్శనమని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతలు అడ్డగోలుగా ఆక్రమించుకున్న నిర్మాణాలను కూల్చాలని హితవు పలికారు. పిరికిపంద చర్యలకు తెదేపా భయపడదని.., పరిణామాలకు ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. కక్షసాధింపు చర్యలను విద్యార్థులంతా చూస్తున్నారని ప్రణవ్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి