ETV Bharat / state

జిల్లాకు ముగ్గురు సంయుక్త కలెక్టర్లు - జిల్లాకు ముగ్గురు సంయుక్త కలెక్టర్లు

కృష్ణా జిల్లాలో పరిపాలనను మరింత పటిష్టం చేసేందుకు ముగ్గురు సంయుక్త కలెక్టర్లను నియమించింది ప్రభుత్వం. ప్రస్తుత సంయుక్త కలెక్టర్ల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ చేసి.. వివిధ శాఖలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Three JCs for Krishna District
Three JCs for Krishna District
author img

By

Published : May 11, 2020, 5:36 PM IST

జిల్లా పరిపాలనను మరింత పటిష్టం చేసేందుకు మరో ఐఏఎస్‌ అధికారి రానున్నారు. జిల్లా కలెక్టర్‌కు పరిపాలనలో సహాయకారిగా సంయుక్త కలెక్టర్ల వ్యవస్థ ఉంది. ప్రస్తుతం సంయుక్త కలెక్టర్ల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ (రీడిజిగ్నేషన్‌) చేసింది. వివిధ శాఖలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇద్దరు సంయుక్త కలెక్టర్లు మాత్రమే ఉన్నారు.

ప్రస్తుతం వీరి సంఖ్యను ముగ్గురికి పెంచింది. కృష్ణా జిల్లాకు రెండో సంయుక్త కలెక్టర్‌గా విశాఖ జిల్లా సంయుక్త కలెక్టర్‌-2గా పని చేస్తున్న ఎల్‌.శివశంకర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జాయింట్‌ కలెక్టర్‌-1గా ప్రస్తుతం పని చేస్తున్న కె.మాధవీలత కొనసాగుతారు. జేసీ3గా మోహన్‌రావు వ్యవహరిస్తారు. వారి హోదాలను మార్చుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

జేసీ రైతు భరోసా, రెవెన్యూ...

మొదటి సంయుక్త కలెక్టర్‌కు జేసీ రైతుభరోసా, రెవెన్యూ(ఆర్‌బీ అండ్‌ ఆర్‌)గా వ్యవహరిస్తారు. ఆ శాఖలతో పాటు జిల్లాలో ప్రధాన శాఖలను జేసీ రైతుభరోసా, రెవెన్యూ పర్యవేక్షిస్తారు. ఈ హోదాలో ప్రస్తుతం ఉన్న కె.మాధవీలత కొనసాగుతారు. గ్రూపు1 అధికారి అయిన ఆమె 2014 బ్యాచ్‌ ఐఏఎస్‌ కన్ఫర్డ్‌ అధికారిణి. ఆర్డీఓ, జేసీ హోదాల్లో పని చేశారు. కృష్ణా జిల్లా జేసీగా వచ్చి ఏడాది అవుతోంది. ధాన్యం కొనుగోలు, భూసేకరణలో ఆమె ప్రత్యేకత చాటుకున్నారు.

ప్రస్తుతం జేసీ రైతుభరోసా, రెవెన్యూ మొత్తం 14 శాఖలు అప్పగించారు. వ్యవసాయం, పౌరసరఫరాలు, మార్కెటింగ్‌, సహకారం, పశుసంవర్థకశాఖ, ఉద్యానశాఖ, మత్స్య, పట్టు పరిశ్రమ శాఖలు, రెవెన్యూ మరియు సర్వే, ప్రకృతి విపత్తుల నిర్వహణ, జలవనరులు, శాంతి భద్రతలు, ఎక్సైజ్‌, భూగర్భ గనులు, విద్యుత్తు శాఖలు పర్యవేక్షిస్తారు. గతంలో రెవెన్యూ, సివల్‌ సప్లయ్‌తో పాటు సంక్షేమ శాఖలు అన్నీ పర్యవేక్షించేవారు.

జేసీ వీ, డబ్ల్యూఎస్‌ అండ్‌ డీ

ప్రభుత్వం కొత్తగా సృష్టించిన జేసీ2 పోస్టుకు ఐఏఎస్‌లనే నియామకం చేసింది. రెండో జేసీని గ్రామ, వార్డు సచివాలయం, అభివృద్ధిగా పిలుస్తారు. ఈ పోస్టులో కృష్ణా జిల్లాకు ఎల్‌.శివశంకర్‌ రానున్నారు. ప్రస్తుతం విశాఖ జిల్లా సంయుక్త కలెక్టర్‌ 2గా ఉన్నారు. 2013 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన శివశంకర్‌ సీతంపేట ఐటీడీఏ పీఓగా పని చేశారు. అనంతరం విశాఖ జేసీగా నియమితులయ్యారు. తర్వాత ఇక్కడ జేసీ 1గా 2014బ్యాచ్‌కు చెందిన వేణుగోపాలరెడ్డి నియమితులయ్యారు.

శివశంకర్‌ను జేసీ2గా నియమించారు. ఆయన కొంతకాలం సెలవుపై వెళ్లారు. ప్రస్తుతం జేసీ 2గా ఆయన్ను కృష్ణా జిల్లాకు నియమించారు. జేసీ2 మొత్తం 10 శాఖలను పర్యవేక్షించాల్సి ఉటుంది. గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామ వార్డు వాలంటీర్ల శాఖ, పంచాయతీరాజ్‌, వైద్యం కుటుంబ సంక్షేమశాఖ, పాఠశాల విద్య, సాంకేతిక విద్య, ఉన్నత విద్య, పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ, గృహ నిర్మాణం, మీసేవ, ఆర్‌టీజీ, ఐటీఈఅండ్‌సీ శాఖ, అన్ని ఇంజినీరింగ్‌ శాఖ (విద్యుత్తు, నీటిపారుదల మినహా)లు ఆ పోస్టు పరిధిలో ఉంటాయి.

జేసీ ఏ అండ్‌ డబ్ల్యూ...

మూడో సంయుక్త కలెక్టర్‌ను జేసీ ఆసరా, సంక్షేమంగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం జేసీ2ను జేసీ3గా పిలుస్తారు. ఈ పోస్టులో నాన్‌ ఐఏఎస్‌ క్యాడర్‌ అధికారులను నియమించారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో మోహన్‌రావు జేసీ 3గా వ్యవహరిస్తారు. గ్రూపు1 అధికారిగా ఉంటారు. ఈ పోస్టును గతంలో అదనపు సంయుక్త కలెక్టర్‌గా వ్యవహరించేవారు. కలెక్టర్‌ అప్పగించిన బాధ్యతలను నిర్వహించేవారు. ప్రత్యేకంగా అధికారాలు లేవు.

కలెక్టర్‌ ద్వారా సంక్రమించిన అధికారాలనే వినియోగించేవారు. ప్రస్తుతం ఆసరా, సంక్షేమ శాఖలను పర్యవేక్షిస్తారు. జేసీ 3 మొత్తం 10 శాఖలను నిర్వహించాల్సి ఉంటుంది. గ్రామీణాభివృద్ధి, డీఆర్‌డీఏ, డ్వామా, బీసీ సంక్షేమం, ఎస్సీ సంక్షేమం, గిరిజన సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, పరిశ్రమలు, వాణిజ్యం శాఖ, దేవదాయ శాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖలను అప్పగించారు.

ఈ శాఖలతో పాటు కలెక్టర్‌ విచక్షణాధికారం ప్రకారం ఇతర శాఖలను ముగ్గురికి అప్పగించే అవకాశం ఉంది. జేసీ రైతుభరోసా, రెవెన్యూకు అధిక ప్రాధాన్యం ఉంటుంది.

ఇదీ చదవండి:

జీవో​ 3పై తెలంగాణతో సమన్వయం చేసుకోండి: సీఎం జగన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.