గతేడాది కంచికచర్లలో సంచలనం సృష్టించిన వృద్ధ దంపతుల కేసులో చిక్కుముడి వీడింది. పెనమలూరులో ఏటీఎం దొంగతనం చేసి పట్టుబడిన ముగ్గురు నిందితుల వేలిముద్రల ఆధారంగా కంచికచర్లలో వృద్ధ దంపతులను వారే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
డిసెంబర్ 25 రాత్రి బండారుపల్లి నాగేశ్వరరావు అలియాస్ నాగులు, భార్య ప్రమీలారాణి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేసేందుకు వచ్చి హత్య చేసి ఉంటారని పోలీసులు భావించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. ఇంటి వెనుక ఉన్న మెస్ డోర్ తెరచి దొంగలు లోపలికి ప్రవేశించారని అని పోలీసులు గుర్తించారు.
పట్టించిన ఏటీఎం చోరీ..
ఇటీవల పెనమలూరులోని ఓ ఏటీఎం చోరీ విషయంలో ముగ్గురు నిందితుల అరెస్ట్ చేశారు. హత్య చేసినప్పుడు సేకరించిన వేలిముద్రలు, చోరికి పాల్పడిన వారివి సరిపోలాయి. జంట హత్యకు పాల్పడింది వారేనని గుర్తించారు. దొంగతనాలతో పాటు పలు హత్యల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు సమాచారం పోలీసులు చెబుతున్నారు. యూట్యూబ్లో నేర కథనాల ద్వారా యువకులు పథకాలు రచిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఒంటరి మహిళలు, వృద్ధులను టార్గెట్ చేసి సహజ మరణం పొందినట్లు ఎవరికీ అనుమానం రాకుండా హత్యలు చేస్తున్నారని పోలిసులు తెలిపారు.
ఇదీ చదవండి: చోరీ కేసులు ఛేదించిన పోలీసులు.. ఆరుగురు పాత నేరస్తుల అరెస్టు