కృష్ణాజిల్లా తిరువూరు సమీపంలోని డ్రైవర్స్ కాలనీ వద్ద ఎన్ఎస్పీ తిరువూరు మేజర్ కాలువకు గండి పడింది. దీంతో సాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన సాగర్ జలాలు వృథాగా పోతున్నాయి. కాలువ కరకట్ట బలహీనంగా ఉండటం గండికి కారణమైంది. ఫలితంగా ఎగువకు నీటి సరఫరా నిలిచిపోయింది. మెట్ట, మాగాణి పంటలు తుదిదశకు చేరుకున్న సమయంలో కాలువకు గండి పడటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటకు మరో రెండు, మూడు తడులు అందించాల్సి ఉందని.. గండి పడిన చోట తక్షణం మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: పిల్లలమర్రికి పునరుజ్జీవం.. ఆ మహావృక్షం మాత్రం శిథిలావస్థకు