ETV Bharat / state

పని లేక... మజూరీ చాలక! - కొవిడ్​ కారణంగా నేత పరిశ్రమ ఇబ్బందులు

కొవిడ్‌ కారణంగా ఎన్నో పరిశ్రమలు కుదేలయ్యాయి. ముఖ్యంగా నేతన్న పరిశ్రమ పూర్తిగా దెబ్బ తింటోంది. ఇప్పటికే ఎన్నో సమస్యలను ఎదుర్కోంటున్న..చేనేతలు లాక్​డౌన్​ కారణంగా పరిస్థితి మరింత దిగజారిపోతోంది. మరో వైపు మాస్టర్‌ వీవర్స్‌ కూడా మజూరీ తగ్గించడంతో నేత కార్శికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

నేత పరిశ్రమ
weaving industry
author img

By

Published : Oct 12, 2020, 3:18 PM IST

అసలే అంతంత మాత్రంగా ఉన్న నేతపరిశ్రమ కొవిడ్‌ కారణంగా కోలుకోలేని స్థితికి వెళ్లిపోయింది. దీంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లోని చేనేత సంఘాల కార్మికులకు పూర్తిగా పనికల్పించ లేకపోవడంతో నేతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ఇప్పటికే అనేక అవస్థలు పడుతున్న తరుణంలో మాస్టర్‌ వీవర్స్‌ కూడా మజూరీ తగ్గించడంతో కార్మికులు మరింత ఆందోళన చెందుతున్నారు. లాక్‌డౌన్‌ నుంచి అన్‌లాక్‌లోకి వచ్చినా నేతపరిశ్రమ కోలుకోలేదు. దీంతో ఎన్నాళ్లు మగ్గం పనితో బతుకుబండిని లాగగలమోనని వారు ఆవేదన చెందుతున్నారు.

జిల్లాలో వ్యవసాయం తరువాత ఎక్కువమంది నేతపరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తారు. అలాంటి పరిశ్రమ కొన్నేళ్లుగా ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. దీనివల్ల అనేక మంది కార్మికులు ఉపాధిని కోల్పోయి ఇతర రంగాల వైపు వెళ్లిపోయారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంతోపాటు గూడూరు, పెడన, ఘంటసాల, ముదినేపల్లి, చల్లపల్లి, మొవ్వ మండలాల్లో నేతకార్మికులు ఉంటారు. మొత్తం 34 సంఘాల పరిధిలో వేలాదిమంది కార్మికులు నేతపనిపై ఆధారపడి జీవిస్తారు. కానీ కొవిడ్‌ కారణంగా వ్యాపారాలు లేక, ఎగుమతులు నిలిచిపోవడంతో వస్త్ర ఉత్పత్తులు ఎక్కడివి అక్కడ పేరుకుపోయాయి.

సంఘాలు పని కల్పించ లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన మాస్టర్‌ వీవర్స్‌ కార్మికులకు అందించే మజూరీ కూడా తగ్గించడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో మాస్టర్‌ వీవర్‌ కింద 100 నుంచి 200 మంది వరకు కార్మికులు ఉంటారు. వారంతా కార్మికులకు ఆర్డర్లు ఇచ్చి ఉత్పత్తి చేసిన వస్త్రాలను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయించి లాభాలు పొందుతుంటారు. కార్మికుల్లో భార్యా, భర్తలు ఇద్దరూ కలిపి 9 గజాల చీరకు రెండు రోజులు, 6 గజాల చీరకు ఒక రోజు పనిచేయాల్సి ఉంటుంది. ఒక చీర నేస్తే గతంలో రూ.500లు ఇచ్చే వారు. ప్రస్తుతం రూ.300లు మాత్రమే ఇస్తామంటున్నారని, పనిలేక వాళ్లు ఇచ్చినదానికే పనిచేయాల్సి వస్తుందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.ఇలాగే ఉంటే మరింత మంది నేత పని మానేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని నేతకార్మికులు కోరుతున్నారు.

- మేడక కోటేశ్వరమ్మ, కప్పలదొడ్డి, గూడూరు మండలం

ప్రస్తుతం పనిలేకపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. సహకార సంఘాల్లో ఉత్పత్తులు నిలిచిపోవడంతో పని కల్పించలేకపోతున్నారు. మాస్టర్‌ వీవర్స్‌ వద్ద పనిచేసుకుంటున్న సమయంలో వాళ్లు కూడా మజూరీ తగ్గించడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్న తరుణంలో అంతంత మాత్రపు వేతనాలతో అవస్థలు పడుతున్నాం. ఉత్పత్తులు కొనుగోలు చేయడంతోపాటు మాకు పని కల్పించేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నాం.

- ములకల శ్యామలరావు, చేతివృత్తుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు

నేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి. సహకార సంఘాలూ పని కల్పించక, మాస్టర్‌ వీవర్స్‌ కూడా వేతనాలు తగ్గించేయడంతో వందలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. వినియోగదారులు కూడా ప్రస్తుతం ఉన్న రకాలు కాకుండా కొత్తవి కావాలని అడుగుతున్నారు. అలాంటి వస్త్రాలు నేయడానికి శిక్షణ ఇప్పించాలని కోరుతున్నాం. ఇటీవల నిర్వహించిన సమావేశంలో కూడా ఈ విషయాన్ని తెలియజేశాం. పాలకులు స్పందించి కార్మికులకు పూర్తిస్థాయిలో పనికల్పించడంతోపాటు అధునాతన డిజైన్లపై శిక్షణ ఇప్పించాలని కోరుతున్నాం.- రఘునందన్‌, ఏడీ, చేనేతజౌళీ శాఖ

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాల్లో ఉత్పత్తులు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ఆప్కో అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మళ్లీ కొనుగోలు చేస్తామని చెప్పారు. కార్మికులకు మాస్టర్‌ వీవర్స్‌ ఇచ్చే మజూరీ తగ్గించినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేలా కృషిచేస్తాం.

ఇదీ చదవండి:

రాజధాని ప్రధాన పిటిషన్లపై దసరా తర్వాత విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.