Sachidananda swamiji : మైసూరు అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి సహస్రచంద్రదర్శన శాంతి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. దేశం నలుమూలల నుండి అనేక మంది చతుర్వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజ్య స్వామీజీ వారు విశేషంగా భక్తులకు తమ అనుగ్రహ సందేశం అందించారు. గత 50 సంవత్సరాల నుండి పూజ్య స్వామీజీ జన్మదినోత్సవ వేడుకల్లో వివిధ శాఖలకు చెందిన వేదపండితులు, అర్చకులను గౌరవించే ఆనవాయితీ క్రమంలో నేడు అనేక మంది చతుర్వేద పండితులను, ఆలయ అర్చకులను గౌరవించారు. వేదవిద్యను అందరూ ప్రోత్సహించాలని అన్నారు. ఆలయ అర్చకులను అందరూ గౌరవించాలి వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలి అన్నారు. అర్చకులను గౌరవించక పోతే ధర్మం క్షీణిస్తుంది, అర్చకులను పోషిస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది అన్నారు. ఆలయాలను రక్షించడంలో అర్చకులు పోషిస్తున్న ప్రధానపాత్ర కొనియాడారు. భారతీయులమైన మనం అర్చకులను తప్పనిసరిగా ప్రోత్సహించి వారికి కావలసిన వసతులు కల్పించటం మన బాధ్యత గా అందరూ ఆచరించాలి అని సూచించారు. తన భక్తులు అలా చేస్తే తనకు ఎంతో తృప్తిగా ఉంటుందని స్వామీజీ పేర్కొన్నారు.
వేదాల్ని ఎంతగా పోషిస్తే మన దేశం అంత సుభిక్షంగా ఉంటుంది. అర్చకులను గౌరవించండి. మన దేవాలయాల్లో ఉన్న అర్చకులను మాత్రమే కాదు.. అందరినీ గౌరవించాలి. చేతనైన సాయం, సేవ చేయండి. వారే మన ఆలయాలను రక్షిస్తున్నారు. హిందువులమై ఉండి.. భారతంలో పుట్టిన మనం ఈ గౌరవం మనం ఇవ్వకపోతే.. ఈ ధర్మం క్షీణించిపోతుంది. - అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ
ఇవీ చదవండి :