ETV Bharat / state

రాష్ట్రంలో దొంగల బీభత్సం... మూడేళ్లలో రూ.363 కోట్లు చోరీ...

రాష్ట్రంలో చోరీలకు పాల్పడటంలో దొంగలు తెలివి మీరుతున్నారు. ఎన్​సీఆర్​బీ గణాంకాల ప్రకారం.. నిత్యం మన ఆంధ్రప్రదేశ్​లో కోట్ల రూపాయల సొమ్ము దొంగలపాలవుతోంది. ఇందులో సగానికి పైగా నగదును పోలీసులు రాబట్టలేకపోతున్నరని నివేదిక వెల్లడించింది.

దొంగలు మాయం చేసిన సొమ్ము
దొంగలు మాయం చేసిన సొమ్ము
author img

By

Published : Nov 25, 2019, 5:09 PM IST

Updated : Nov 26, 2019, 9:05 AM IST

రాష్ట్రంలో రోజుకు సగటున రూ.33 లక్షలపైగా సొత్తు మాయం

రాష్ట్రంలో దొంగలు రోజురోజుకూ తెగిస్తున్నారు. చోరీలకు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ విషయాన్ని... ఎన్​సీఆర్​బీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో రోజుకు సగటున 50 నేరాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ దాదాపు రూ.363 కోట్ల సొత్తు మాయమైంది. సగటున ఒక్కో నేరంలో రూ. 60 వేల విలువైన సొత్తు దొంగలపాలవుతోంది. 2015 - 17 సంవత్సరకాలంలో రాష్ట్రంలో జరిగిన ఈ తరహా నేరాలు... వాటిల్లో బాధితులు పోగొట్టుకున్న సొత్తును విశ్లేషించగా.. ఈ లెక్కలు తేలాయి.

రికవరీ కష్టమే:

చోరీ అవుతున్న నగదు మాత్రం పూర్తిస్థాయిలో పోలీసులు తిరిగి రాబట్టలేకపోతున్నారు. 2015 - 17 సంవత్సరంలో రాష్ట్రంలో 54 వేల 783 చోరీలు, దోపిడీలు, బందిపోటు నేరాలు జరిగాయి. వాటిల్లో కోట్ల రూపాయల సొత్తు చోరీకి గురైంది. ఈ ప్రకారం రోజుకు సగటున దొంగల పాలైన మొత్తం రూ. 33.15 లక్షలుగా తేలింది. మరోవైపు పోలీసులు నేరాలను ఛేదించినా.. సగం నగదును కూడా తిరిగి రాబట్టలేకపోతున్నారు. కేవలం 43.52 శాతం అంటే రూ. 158 కోట్ల మాత్రమే పోలీసులు రికవరీ చేయగలిగారు. దోచుకున్న సొత్తులో చాలా వరకూ సొమ్మును.. దొంగలు పోలీసులకు పట్టుబడక ముందే ఖర్చు చేసేస్తున్నారు. ఏవైనా కేసుల్లో పట్టుబడ్డా.. పోయిన మొత్తాన్ని తిరిగి రాబట్టటం కష్టసాధ్యమవుతోంది.

2015 - 17 సంవత్సరకాలంలో నేరాలు

నేర రకం 2015 2016 2017
చోరీలు 14,062 13,856 13,303
బర్గలరీలు 3,560 4,405 4,386
రాబరీలు 384 315 340
డెకాయిటీలు 55 63 58
మొత్తం 8,061 18,635 18,087

2015 - 17 సంవత్సరకాలంలో పోయిన సొత్తు

సంవత్సరం పోయిన సొత్తు (రూ . కోట్లలో ) రాబట్టగలిగింది ( రూ . కోట్లలో )
2015 121 . 1 55 . 2
2016 113 . 2 46 . 5
2017 127 . 0 56 . 3
మొత్తం 363 158

sample description
Last Updated : Nov 26, 2019, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.