కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పాపవినాశనం వద్ద కృష్ణా నదిలో చిక్కుకున్న ఆరుగురిని పోలీసులు కాపాడారు. ఇవాళ ఉదయం పట్టుపురుగులకు మేత వేసేందుకు తెల్లవారుజామున 5.30 గంటలకు లంకకు వెళ్లిన వారు వరద నీటిలో చిక్కుకుపోయారు. నది ఒడ్డున ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ద్వారా సమాచారం తెలుసుకున్న చల్లపల్లి సీఐ వెంకట నారాయణ ఘటనా స్థలానికి వెళ్లారు. గుంటూరు జిల్లా నుంచి వచ్చిన మత్స్య శాఖ అధికారులు, గజ ఈతగాళ్ల సాయంతో రెండు బోట్లలో రైతులకు వద్దకు చేరుకున్నారు. అనంతరం రైతులను సురక్షితంగా పాపవినాశనం గ్రామం వైపు ఉన్న ఒడ్డుకు చేర్చారు. వీరిలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
కృష్ణానదిలో చిక్కుకున్న రైతులు సురక్షితం - krishna river
పాపవినాశనం వద్ద వరదలో చిక్కుకున్న వారిని పోలీసులు సురక్షితంగా బయటకుతీసుకువచ్చారు. రెండు బొట్లలో పాపవినాశనం గ్రామం వైపు ఉన్న ఒడ్డుకు చేర్చారు. వీరిలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు
కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పాపవినాశనం వద్ద కృష్ణా నదిలో చిక్కుకున్న ఆరుగురిని పోలీసులు కాపాడారు. ఇవాళ ఉదయం పట్టుపురుగులకు మేత వేసేందుకు తెల్లవారుజామున 5.30 గంటలకు లంకకు వెళ్లిన వారు వరద నీటిలో చిక్కుకుపోయారు. నది ఒడ్డున ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ద్వారా సమాచారం తెలుసుకున్న చల్లపల్లి సీఐ వెంకట నారాయణ ఘటనా స్థలానికి వెళ్లారు. గుంటూరు జిల్లా నుంచి వచ్చిన మత్స్య శాఖ అధికారులు, గజ ఈతగాళ్ల సాయంతో రెండు బోట్లలో రైతులకు వద్దకు చేరుకున్నారు. అనంతరం రైతులను సురక్షితంగా పాపవినాశనం గ్రామం వైపు ఉన్న ఒడ్డుకు చేర్చారు. వీరిలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
...................................................................................
యాంకర్ : లక్ష్యం ఘనం...సమయం స్వల్పం . రాష్ట్రంలో కొలువుల జాతర ప్రారంభమయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల కోసం వేట ప్రారంభించారు . పోటీ పరీక్షల్లో నిలిచి ఉద్యోగాలు సాధించేందుకు నిరుద్యోగులు నిత్యం కష్టపడుతున్నారు. అందుబాటులో ఉన్న అవకాశాలు వినియోగించుకుంటున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగ పోటీ పరీక్షలకు మెటీరియల్స్ కొనలేని పేద వారు....మధ్య తరగతి నిరుద్యోగులు మాత్రం గ్రంధాలయాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయం పోటీ పరీక్షలకు పోటీ పడుతున్న నిరుద్యోగులతో కళకళలాడుతోంది...
వాయిస్ ఓవర్: ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు కోర్టు సెంటర్ లోని జిల్లా కేంద్ర గ్రంథాలయం లో 1973 లో ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి ప్రతి రోజు వందల సంఖ్యలో నిరుద్యోగులు, విద్యార్థులు, చిన్నారులు , వృద్ధులు , మహిళలు ఈ గ్రంథాలయానికి వస్తూనే ఉంటారు. వృద్ధులు గ్రంధాలయంలో ఉండే దిన పత్రికలు చదవడానికి ప్రాధాన్యత ఇస్తే....నిరుద్యోగులు రిఫరెన్స్ పుస్తకాల విభాగంలో పుస్తకాలు ముందు వేసుకొని గ్రూప్స్ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతూ కనిపిస్తారు. విద్యార్థులు, చిన్నారులు పాఠ్య పుస్తకాల విభాగంలో బిజీ బిజీ గా గడిపేవారు. అయితే ఇప్పుడు గ్రంథాలయంలో సీన్ అంతా మారింది. సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి నిరుద్యోగులు జిల్లా కేంద్ర గ్రంథాలయానికి క్యూ కడుతున్నారు. భోజనం వెంటతెచ్చుకొని ఉదయం నుంచి సాయంత్రం గ్రంథాలయం మూసివేసేవరకు అక్కడే ఉండి సాధన చేస్తున్నారు. మధ్యాహ్నం వెంట తెచ్చుకున్న భోజనాన్ని అందరూ కలిసి అక్కడే పూర్తిచేసి మరల సాధనలో నిమగ్నమవుతున్నారు.అయితే కష్టపడి ఉద్యోగానికి ఎంపిక అవ్వాలన్న వారి ఆశయం ఉన్నతంగా ఉన్నా గ్రంథాలయంలో సదుపాయాలు మాత్రం వారిని వెక్కిరిస్తున్నాయి. పోటీ పరీక్షలకు కావాల్సిన మెటీరియల్స్ గ్రంధాలయంలో అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. లైబ్రరీలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందన్న కారణంతో తమ వెంట పుస్తకాలు తెచ్చుకొని మరీ లైబ్రరీ కి వచ్చి పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే పుస్తకాల కొరత విషయం గ్రంథాలయ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా....పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు వాపోయారు. ఎటువంటి పుస్తకాలు కావాలో అభిప్రాయాలు తీసుకుంటారే కానీ పుస్తకాలు మాత్రం రావని పరిస్థితి వివరించారు. గ్రంథాలయ సిబ్బంది పర్యవేక్షణ ఉండదని కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా సంబంధిత అధికారులు విఫలమయ్యారని నిరుద్యోగులు అంటున్నారు....బైట్
1.సుధాకర్, నిరుద్యోగి
2.ఆదినారాయణ, నిరుద్యోగి
వాయిస్ ఓవర్: గ్రంథాలయంలో కుర్చీలు, స్టడీ టేబుళ్ల కొరత తీవ్రంగా ఉంది. కుర్చీలు నిండి పోతే పాఠకులు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రంథాలయంలో ఇంకా గదులు ఉన్నా తెరచి కుర్చీలు వేసి సమస్య పరిష్కరించాలనే ఆలోచన మాత్రం గ్రంథాలయ నిర్వాహకులకు కనిపించడం లేదు. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సాధన చేస్తున్న చాలా మంది నిరుద్యోగులు గ్రంథాలయానికి వచ్చి కూర్చోడానికి పుస్తకం పెట్టుకొని సాధన చేయడానికి స్టడీ కుర్చీలు లేక వెనుతిరిగివెళ్లిపోయారు.గ్రంథాలయ కార్యదర్శి మాత్రం పోటీ పరీక్షలకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయని అంటున్నారు. సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి గ్రంథాలయానికి నిరుద్యోగులు ఎక్కువుగా వస్తున్నారని తెలిపారు. సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన సాధనకు మెటీరియల్స్ కొరత ఉన్నమాట వాస్తవమేనని త్వరలోనే పుస్తకాలు గ్రంథాలయంలో అందుబాటులో ఉంటాయని హామీ ఇచ్చారు...బైట్
4.రాజేష్, నిరుద్యోగి
6.మధు సూదన్, కార్యదర్శి, జిల్లా కేంద్ర గ్రంథాలయం, ఒంగోలు
వాయిస్ ఓవర్: గ్రామ సచివాలయ ఉద్యోగ అర్హత పరీక్షకు సమయం తక్కువగా ఉందని ....చదవాల్సిన సిలబస్ మాత్రం ఎక్కువగా ఉందని నిరుద్యోగులు అంటున్నారు. అరకొర వసతుల మధ్య పేద మధ్య తరగతి నిరుద్యోగులు సరిగా సాధన చేయలేకపోతున్నారని వాపోయారు. ముఖ్యమంత్రి తమ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ఇచ్చిన తేదీల్లో కాకుండా మరో 15 రోజుల తర్వాత అర్హత పరీక్షను నిర్వహించాలని వేడుకొంటున్నారు. ఈ లోపుగా జిల్లా గ్రంథాలయం లో కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉంచాలని కోరారు....బైట్
5.దేవి, పాఠకురాలు, నిరుద్యోగి.
వాయిస్ ఓవర్: జిల్లా కేంద్రంలో ఉండి నిత్యం వేలాది మంది వచ్చే జిల్లా గ్రంథాలయంలోనే సరైన సదుపాయాలు, పుస్తకాలు లేకపోవడం పట్ల విద్యార్థులు, నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి తమ భవిష్యత్ కి తోడ్పాటును అందించాలని కోరుకొంటున్నారు.....
Body:ongole
Conclusion:9100075319