A pastor Is strange comments In Gannavaram: ప్రపంచం టెక్నాలజీలో దూసుకుపోతున్నా కొందరు మాత్రం మూఢనమ్మకాలు వీడటం లేదు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఓ పాస్టర్ నాగభూషణం.. తాను చనిపోయి సమాధి నుంచి మళ్లీ తిరిగొస్తానంటూ ఫ్లెక్సీలు కట్టించుకున్నాడు. గొల్లనపల్లిలోని తన స్థలంలో సమాధి కోసం గొయ్యిని తవ్వించుకున్నాడు. 10 రోజుల్లో తాను చనిపోతే ఇదే సమాధిలో పెట్టాలని.. మళ్లీ 3 రోజుల్లో బ్రతికి వస్తానంటూ కుటుంబసభ్యులకు, గ్రామస్థులకు చెప్తున్నాడు.
ఆయన వైఖరితో కుటుంబసభ్యులు, గ్రామస్థులు కంగారు పడుతున్నారు.. ఇలాంటి పాస్టర్స్ ప్రజలను కూడా అపనమ్మకాలవైపు నడిపిస్తారని.. జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు అంటున్నారు. ముందు ఇతగాడికి కౌన్సిలింగ్ ఇప్పించాలని.. మారని పక్షంలో మానసిక వికలాంగుల సంరక్షణ శాలకు తరలించి.. చికిత్స అందించాలంటున్నారు.
ఇవీ చదవండి: