ETV Bharat / state

Troubles of new pensioners : పెన్షన్.. టెన్షన్..! పెన్షన్​దారులకు షాకిస్తున్న విద్యుత్ సర్వీస్ నంబర్ - సామాజిక పెన్షన్లు

Troubles of new pensioners : అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న వారైన విద్యుత్ సర్వీస్‌ నంబర్‌ను పెన్షన్ యాప్‌లో నమోదు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో నూతన పెన్షన్ దారులు ఆందోళన చెందుతున్నారు. పెన్షన్ అర్హతకు విద్యుత్ సర్వీస్ నంబర్ ను ప్రామాణికంగా తీసుకోబోమని అధికారులు చెబుతున్నా.. ఎందుకు సేకరిస్తున్నారనే ప్రశ్న మాత్రం దరఖాస్తుదారులను వెంటాడుతోంది. ఇంటి యజమానులు విద్యుత్ సర్వీస్ నంబర్ ఇవ్వడం లేదని చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పెన్షన్ దారులు వాపోతున్నారు.

పింఛన్ కష్టాలు
పింఛన్ కష్టాలు
author img

By

Published : Jun 18, 2023, 4:56 PM IST

Troubles of new pensioners : నూతన పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలు పెన్షన్ దారులను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే అర్హులైన వారికి పెన్షన్ ఇచ్చేందుకు సవాలక్ష నిబంధనలను విధించిన ప్రభుత్వం.. తాజాగా పెన్షన్ పంపిణీకి తీసుకున్న నిర్ణయం కొత్త పెన్షన్ దారులను ఆందోళనకు గురి చేస్తోంది. అద్దె ఇంట్లో ఉన్నా ఇంటి యజమానితో కలిసి వినియోగిస్తున్న విద్యుత్ సర్వీస్‌ నంబర్‌ను పింఛను యాప్‌లో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. దీంతో పెన్షన్ దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పింఛను అర్హతకు సర్వీస్ నంబర్ ను ప్రామాణికంగా తీసుకోబోమని సంక్షేమ కార్యదర్శులు దరఖాస్తుదారులతో చెబుతున్నా.. ఎందుకు సేకరిస్తున్నారనే ప్రశ్న మాత్రం వారిని వెంటాడుతోంది.

వివరాలపై ఆరా.. ఆరు నెలల వ్యవధిలో పింఛను కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం తనిఖీ చేపట్టింది. వీరికి జులై 1వ తేదీన పింఛను అందించాల్సి ఉండగా.. మొదటగా విద్యుత్తు వినియోగం ''జీరో''గా నమోదైన దరఖాస్తుదారుల వివరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇలాంటివి రాష్ట్రవ్యాప్తంగా భారీగానే ఉన్నట్లు సమాచారం. తనిఖీ బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయాల్లోని సంక్షేమ కార్యదర్శులకు ఉన్నతాధికారులు అప్పగించారు. ప్రత్యేక అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సాధారణంగా అద్దెకు ఉంటున్న వారు ఇంటి యజమాని పేరుపై ఉన్న విద్యుత్ మీటర్ నుంచే విద్యుత్ ను వినియోగిస్తారు. విద్యుత్ ను వినియోగించుకున్నందుకు ఇంటి యజమానికి కొంత మెత్తంలో డబ్బును చెల్లిస్తారు. ఇప్పుడు అధికారులు విద్యుత్ మీటర్ నంబర్ ను ఖచ్చితం చేయడంతో అద్దెలకు ఉంటున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు అద్దెకు ఉంటున్న వారికి విద్యుత్ సర్వీస్ నంబర్ ఇచ్చేందుకు ఇంటి యజమానులు ఆసక్తి చూపడం లేదు. అయితే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమను అవస్థలకు గురి చేస్తుందని నూతన పెన్షన్ దారులు వాపోతున్నారు. మీడియా ముందుకు వచ్చి తమ ఇబ్బందులను చెప్పుకునేందుకు మాత్రం వెనుకంజ వేస్తున్నారు. తాము ఇప్పుడు మీడియాతో మాట్లాడితే తమకు పెన్షన్ మంజూరు చేయరని వాపోతున్నారు.

యజమానుల్లో ఆందోళన.. కొత్త పెన్షన్ల సంగతేమో కానీ విద్యుత్ చార్జీల పేరుతో ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా పెన్షన్లను తొలగించింది. ప్రస్తుతం ఏ అవసరానికైనా విద్యుత్ బిల్లులు అడుగుతున్నారు. పెన్షన్ కు ఇంటి యజమాని సర్వీస్ నంబర్ ఇద్దామని చూస్తుంటే వారు అంగీకరించడం లేదని పెన్షన్ దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఇంట్లో అద్దెలకు ఉంటున్న వారు మారుతు ఉంటారని ఇలా అద్దెకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలా సర్వీస్ నంబర్ ఇచ్చుకుంటే పోతే భవిష్యత్ లో తమకు ఏదైనా ఇబ్బంది వస్తుందని ఇంటి యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ కారణంగానే అద్దెకు ఉంటున్న వారికి తమ సర్వీస్ నంబర్ ఇచ్చేందుకు ఇంటి యజమానులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం మాత్రం విద్యుత్ సర్వీస్ నంబర్ ను కావాలని అడుగుతుండటంతో ఏం చేయాలో తెలియక పెన్షన్ దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సర్వీస్ నంబర్ లేకుండా దరఖాస్తు చేసుకుంటే తమకు పెన్షన్ వస్తుందో రాదో అని భయపడుతున్నారు. అనేక సంవత్సరాలుగా తమకు పెన్షన్ వస్తున్నా... వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎందుకు నిలుపుదల చేసిందో అర్థం కావడం లేదని వృద్ధులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తోనే తాము జీవనం సాగిస్తున్నామని, ఇప్పడు కనీసం మందులు కొనడానికి కూడా అవస్థలు పడాల్సి వస్తుందని అవేదన చెందుతున్నారు.

భారీగా వడపోత.. గతంలో ప్రతి నెలా కొత్త పింఛన్లు అందిస్తామని ప్రకటించి... కొన్ని నెలలపాటు అమలు చేసి ఆ తర్వాత గడువును 6 నెలలకు ప్రభుత్వం పెంచింది. తాజాగా జులై 1వ తేదీన కొత్త పింఛన్లు అందించాల్సి ఉండగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను రాష్ట్రస్థాయిలో అధికారులు వడపోత చేపట్టారు. పెన్షన్ కోసం దరఖాస్తు చేస్తున్న వారి వివరాల్లో విద్యుత్తు వినియోగం ''జీరో''గా నమోదైన వారి వివరాలపై అధికారులు దృష్టి సారించారు. ఇప్పటి వరకు ఇలాంటి వివరాల తనిఖీ జరగలేదని క్షేత్రస్థాయిలో అధికారులు చెబుతున్నారు. సదరు కుటుంబం విద్యుత్తు సౌకర్యం లేకుండా ఉంటోందా? అద్దె ఇంట్లో ఉంటున్నారా? సొంత ఇల్లులో ఉన్నా విద్యుత్తు వివరాలు నమోదు కాలేదా? ఇంటి యజమాని, అద్దెకు ఉన్నవారూ ఒకే మీటరు వినియోగిస్తున్నారా? వేర్వేరు మీటర్లు కలిగి ఉన్నారా? తదితర వివరాలను నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దరఖాస్తుదారులు, అద్దె ఇళ్లలో ఉన్న వారు వినియోగిస్తున్న మీటర్‌ సర్వీస్‌ నంబర్లను నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

తప్పించుకోవడానికే.. అంటున్న పెన్షన్ దారులు... ప్రభుత్వం పెన్షన్లను మంజురు చేయకుండా తప్పించుకునేందుకు ఈ నిబంధన పెట్టిందని పెన్షన్ దారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి యజమానులు విద్యుత్ సర్వీస్ నంబర్ ఇవ్వరు కాబట్టే ఇటువంటి నిబంధనను పెట్టారని చెబుతున్నారు. ప్రభుత్వం నిబంధనల పేరుతో జీవిత చరమాంకంలో ఉన్న తమను ఇబ్బందిపెట్టడం మంచిది కాదని పెన్షన్ కొల్పోయిన బాధితులు వాపోతున్నారు. నిలిపివేసిన తమ పెన్షన్ ను ప్రభుత్వం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. వివిధ కారణాల పేరుతో ఇప్పటికే చాలా మంది పెన్షన్లను ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం విద్యుత్ మీటర్ నంబర్ తో ఇబ్బందులు కలిగించడంపై పెన్షన్ దారుల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం పారదర్శకంగా పెన్షన్ లను ఇవ్వడం మంచిదే కానీ.. ఇలా అద్దెకు ఉంటున్న వారికి కూడా అవస్థలు పెట్టడం మంచిది కాదని పెన్షన్ దారులు వాపోతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.