కృష్ణా జిల్లా కోడూరు శివారు స్వతంత్రపురం గ్రామంలో చిన్నారులపై పిచ్చి కుక్క దాడిచేసింది. పిల్లలు, పెద్దలు కలిపి మొత్తం ఐదుగురిని కరిచింది. కుక్క కాటుకు గురైన వారిని వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.
అక్కడ వైద్యుడు అందుబాటులో లేని కారణంగా.. బాధితులు 3 గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చింది. పిచ్చి కుక్కల కారణంగా ఆందోళన చెందుతున్నామని.. భయం భయంగా బయటికి వెళ్లి రావాల్సి వస్తోందని బాధితులు చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవీ చదవండి: