కృష్ణాజిల్లా చెవిటిపల్లివద్ద పడవ బోల్తా పడిన ఘటనలో గల్లంతైన బాలిక మృతదేహాన్నిఎన్డీఆర్‌ఎఫ్ గజ ఈతగాళ్లు వెలికితీశారు. సుమారు నాలుగు గంటలు గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహం గోడకు ఆనుకుని ఉండగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. నందిగామ డీఎస్పీ రమణమూర్తి, కంచికచర్ల తహశీల్దారు రాజకుమారిలు దగ్గరుండి పర్యవేక్షించారు. గల్లంతైన బాలిక శవంగా మారటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
సంబంధిత కథనం