ఎండాకాలంలో పగటి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పెరుగుతాయి. దీంతో అగ్నిప్రమాదాలు అధికంగా జరిగే అవకాశాలుంటాయి. సంఘటనా స్థలానికి సకాలంగా అగ్నిమాపక సిబ్బంది చేరుకోకుంటే.. ఎంతటిదైనా బుడిదైపోతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అగ్నిమాపక శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. సంఘటనా స్థలానికి 10 నిమిషాల్లోపే చేరేలా ఫైర్ స్టేషన్లు ప్రణాళికలు వేసుకొని సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు.
గతేడాది 2056 అగ్నిప్రమాదాలు జరిగాయాని.. ఈయేడాది ఫిభ్రవరి వరకు 1635 అగ్నిప్రమాదాలు జరిగినట్లు జిల్లా అగ్నిమాపకాధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వీటిలో 9 సంఘటనల్లో మాత్రమే భారీ స్థాయిలో తీవ్ర నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. అధికంగా గడ్డివాములు మండుతున్న కేసులు నమోదవుతాయని చెప్పారు.
ప్రమాదాలను నివారించేందుకు పాఠశాలలు, దుకాణాల సముదాయాలు, నివాసముండే ప్రాంతాలు, ఆసుపత్రుల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. వేసవిలో ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని నీటిని స్టోరేజ్ చేస్తామని వివరించారు. అత్యాధునిక పరికరాలతో కూడిన భారీ వాహనాలు సైతం అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి...