విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆగస్టు 15 జరగనున్న స్వాతంత్య్రదిన వేడుకల ఏర్పాట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వేడుకలకు తక్కువ సంఖ్యలో అతిథులు వస్తారని తెలిపారు. పోలీసుల పెరేడ్ రిహార్సల్‌ను వీక్షించారు. పోలీసుల నుంచి గౌరవందనం స్వీకరించారు. మరోవైపు వర్షం పడుతుండటంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు.
ఇదీ చదవండి: నక్సలైట్లలో చేరడానికి అనుమతి ఎందుకు... వెళ్లి చేరొచ్చుకదా!: మంత్రి విశ్వరూప్