ETV Bharat / state

'మావి ఆరోపణలు కాదు వాస్తవాలు.. తప్పైతే చర్యలకు సిద్ధం' - Endowment Minister

విజయవాడ దుర్గ గుడి పాలకమండలి, దేవాదాయ శాఖ అధికారుల నిర్ణయాలపై జనసేన పలు అనుమానాలను లేవనెత్తింది. ఆలయానికి లేని ఆదాయాన్ని ఉన్నట్లు చూపించి.. దేవాదాయ శాఖకు అమ్మవారి సొమ్ములను బదిలీ చేసే కుట్ర జరుగుతోందని పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశాలపై సంబంధిత యంత్రాంగం సహా దేవాదాయ శాఖ మంత్రి వెంటనే స్పందించాలని పార్టీ డిమాండ్ చేసింది.

'మావి ఆరోపణలు కాదు వాస్తవాలు.. తప్పైతే చర్యలకు సిద్ధం'

author img

By

Published : Nov 4, 2020, 5:22 PM IST

కృష్ణాజిల్లాలోని విజయవాడ దుర్గ గుడి పాలకమండలి, దేవాదాయ శాఖ అధికారుల నిర్ణయాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్ బాబు తెలిపారు. గుడికి లేని ఆదాయాన్ని ఉన్నట్లు చూపించి.. దేవాదాయ శాఖ అమ్మవారి సొమ్ములను దుర్వినియోగం చేస్తుందని ఆయన మండిపడ్డారు. వెండి సింహాల ప్రతిమలు మాయం కావడంపై ఇప్పటివరకు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ స్పందించకపోవటం శోచనీయమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెంటనే స్పందించాలని మహేశ్ డిమాండ్ చేశారు.

రూ.70 కోట్ల సంగతి చెప్పండి..
దసరా పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఆలయాన్ని సందర్శించి రూ.70 కోట్లు ఆలయ అభివృద్ధికి కేటాయించినట్లు ఆలయ పాలక మండలి ఛైర్మన్ చెప్పారని మహేశ్ గుర్తు చేశారు. అయినప్పటికీ పండగ నాటి సీఎం హామీపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడం పలు విమర్శలకు తావిచ్చినట్లవుతోందన్నారు. వెంటనే నిధుల విడుదలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఫిర్యాదులు అందినప్పటికీ..

దుర్గ గుడి ఈవో సురేష్ బాబు వ్యవహార శైలిపై పలు ఫిర్యాదులు అందినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం అనుమానాలను రేకెత్తిస్తోందన్నారు. తమ పార్టీ తరఫున లేవనెత్తిన అంశాలు తప్పైతే తమపైనే చర్యలు తీసుకోవాలని మహేశ్ బహిరంగ సవాల్ విసిరారు.

ముడుపుల కారణాల వల్లే..

అధికారులపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం మంత్రి నుంచి కింది స్థాయి పాలకమండలి వరకు ముడుపులు అందుతున్నాయనే సమాచారం తమకు ఉందన్నారు. ఈ అనుమానాన్ని బలపరిచేలా దుర్గ గుడి మీద జరుగుతున్న పరిణామాలు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయని మహేశ్ పేర్కొన్నారు.

ఇవీ చూడండి : అనంతలో యువతి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.