మహిళ రూ.25 లక్షల విరాళం...
శ్మశానవాటికను అందాలవనంగా మార్చేశారు. చుట్టూ ప్రహరీగోడ... మధ్యలో శివుని విగ్రహం, కాటికాపరి విగ్రహాలు దర్శనమిస్తాయి. కార్యాలయం, విశ్రాంతి గదులతోపాటు... పిండ ప్రదానం చేయడానికి... ఆఖరి మజిలీ లాంటి ప్రత్యేక నిర్మాణాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దహన సంస్కారాలు నిర్వహించేలా... దహన వాటికను తీర్చిదిద్దారు. దీని ప్రారంభోత్సవాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యుడు పార్థసారధి చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేశారు. దహనవాటిక నిర్మాణంలో రూ.25 లక్షల విరాళం ఇచ్చి ఓ మహిళ కీలక పాత్ర పోషించింది. ఆమె గ్రామానికి చెందిన కెప్టెన్ శ్రీలక్ష్మి. ఈ సందర్భంగా పలువురు శ్రీలక్ష్మిని ప్రశంసించారు.
ఈ స్వర్గపురి ప్రాంగణంలో బల్లలు, రుద్రాక్ష చెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పచ్చని పచ్చిక, రంగురంగుల పూల మొక్కలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. దాతల ఆర్థిక సాయంతోనే శ్మశానవాటిక రూపురేఖలు మారినందున... గోడలపై వారి పేర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు.