విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారికి నందిగామ వద్ద నిర్మిస్తున్న బైపాస్ సర్వీస్ రోడ్డు పనులు అసంపూర్తిగా వదిలేయడంతో మందుబాబులకు అడ్డాగా మారింది. నందిగామ హైవే బైపాస్ రోడ్డుకు అనుసంధానంగా నందిగామ, చందాపురం, అనాసాగరం గ్రామాల్లోకి వెళ్లేందుకు వీలుగా సర్వీస్ రోడ్లు నిర్మిస్తున్నారు. వాటిని పూర్తి చేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. చీకటి పడితే మందుబాబులు సర్వీస్ రోడ్డుపైకి చేరుతున్నారు. పగిలిన మద్యం సీసాలు, వాడి పడేసిన వాటర్ ప్యాకెట్లు, ఆహార పదార్థాలతో సర్వీస్ రోడ్డు భయంకరంగా మారింది. దీంతో ఈ మార్గంలో పలు గ్రామాలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై పోలీసులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ఆలాగా సర్వీసు రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి