ETV Bharat / state

ఆ బ్రిడ్జిపై ప్రయాణించాలంటే.. సాహసం చేయాల్సిందే

అది పది గ్రామాలను కలిపే కీలకమైన వంతెన. వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే రహదారి. రోజూవారి పనులు సాగాలంటే ఆ గ్రామాల ప్రజలు వంతెన దాటక తప్పని పరిస్థితి. ప్రస్తుతం ఆ వంతెన అవసానదశకు చేరడంతో... ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.

bridge
bridge
author img

By

Published : May 31, 2022, 10:17 PM IST

శిథిలావస్థకు చేరుకున్న బ్రిటీష్ కాలం నాటి వంతెన.. ప్రయాణం చేయాలంటేనే..

A British-era bridge to ruin: కృష్ణా జిల్లా కంకిపాడు-గుడివాడ మధ్య ఉండే రహదారి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. సమీప గ్రామాల ప్రజలు వివిధ పనుల కోసం గుడివాడ, గన్నవరం, విజయవాడ సహా పలు ప్రాంతాలకు వెళ్తుంటారు. పునాదిపాడు-పెదపారిపూడి రహదారిలో.. పది గ్రామాలను కలుపుతూ కుందేరు గ్రామం బయట... కాలువపై బ్రిటీష్ కాలం నాటి వంతెన ఉంది. దశాబ్దం క్రితం..ఈ ఇనుప వంతెన కూలిపోయింది. కూలిన బ్రిడ్జి పిల్లర్ల మీద ఇనుప రాడ్లతో తాత్కాలిక వంతెన నిర్మించారు. ఈ మార్గం మీదుగా భారీ వాహనాలు వెళ్లడంతో... మూడేళ్లలోనే బ్రిడ్జి దెబ్బతింది. అధిక బరువుతో కొన్నిచోట్ల ఇనుప రేకులు విరిగిపోగా.. మరికొన్ని తుప్పు పట్టిపోయాయి. ప్రస్తుతం ఈ వంతన ప్రమాదకరంగా మారింది.

వంతెపై ఏర్పాటు చేసిన రేకులు పోయినప్పుడు కేవలం వెల్డింగ్ మరమ్మతు చేస్తున్నారని... కొద్ది రోజులకే అవి దెబ్బతింటున్నాయి. బ్రిడ్జిపై ఏర్పడ్డ ఖాళీల్లో వాహనాల టైర్లు ఇరుక్కుపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. రేకులు తప్పుపట్టి ఎప్పుడు ఊడిపోతాయో తెలియని పరిస్థితి ఉంది. నిత్యం భయాందోళన మధ్య ప్రయాణం చేస్తున్నాం -ప్రయాణికులు

వంతెన పూర్తిగా పాడైపోవటంతో కొత్త వంతెన నిర్మించాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో 6 కోట్ల 50 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించి.. 90 శాతం పూర్తి చేశారు. ఆ తర్వాత ఎన్నికలు రావటంతో వంతెన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అనంతరం... వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక పెనమలూరు ఎమ్మెల్యే వంతెన నిర్మిస్తానని అనేకసార్లు హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఊసే ఎత్తటం మానేశారని గ్రామస్తులు వాపోతున్నారు. వంతెన నిర్మాణంలో భాగంగా కుందేరు గ్రామస్తుల స్థలాలను అధికారులు తీసుకున్నారు. అయితే వారికి పరిహారం చెల్లించ లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి: Nakka: 'మా ప్రభుత్వం మా ఇష్టం' అనే రీతిలో వైకాపా నేతల అక్రమ తవ్వకాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.