రాజధాని గ్రామాల నుంచి అమరావతి పరిరక్షణ సమితి, రైతు ఐకాస ఆధ్వర్యంలో ఏఎమ్ఆర్డీఏ కార్యాలయానికి వస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మరికొందరిని కార్యాలయం లోపలికి ప్రవేశించకుండా నిలువరించారు. ఈఘటనపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎమ్ఆర్డీఏ కమిషనర్‌ను కలిసి సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చిన తమను బలవంతంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఆరోపించారు.
మహిళలనూ వాహనాలు ఎక్కిస్తుండగా కొందరికి గాయాలయ్యాయి. కౌలు చెల్లించాలని శాంతియుతంగా నిరసన తెలియజేయటానికి వచ్చిన తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి, దౌర్జన్యంగా స్టేషన్‌లకు తరలించారని ఆవేదన చెందారు. రైతుల ముట్టడి కార్యక్రమానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఎం విజయవాడ నగర కార్యదర్శి బాబూరావు, కాంగ్రెస్ నాయకురాలు సుంకరి పద్మశ్రీను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. కౌలు డబ్బులు ఇస్తామని చెప్పి 3 నెలలు గడుస్తున్నా... ఇప్పటికీ విడుదల చేయలేదని వారు ఆగ్రహించారు.
ఇదీ చూడండి: