తమపై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేసింది. రాజకీయ కారణాలతో కక్షసాధింపు కోసం..చట్ట నిబంధనలకు విరుద్ధంగా ధూళిపాళ్ల నరేంద్ర, గోపాలకృష్ణన్‌పై అనిశా కేసు నమోదు చేసిందని...... పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది.... బి. ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. సంగం డెయిరీ న్యాయబద్ధంగానే కార్యకలాపాలు నిర్వస్తోందని కోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు భూములను..ఆసుపత్రి ఏర్పాటు నిమిత్తం ట్రస్టుకు బదిలీ చేశారని ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. పిటిషనర్ల వాదనలు అనిశా తరపు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వులో ఉంచింది.
ఇవీ చదవండి